Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సాహితీ విజ్ఞాన ఖని కోవెల సంపత్కుమారాచార్యా సంస్కత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండిత శ్రేష్ఠులని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలోని సమావేశ మందిరంలో ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య స్మారక ప్రసంగ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథి గా డాక్టర్ రమణ మాట్లాడుతూ తెలంగాణ మాగాణిలో ఎందరో సాహితీ మహనీయులు పుట్టారని, దాశరథి, సినారె వంటి వారితో ఎన్నదగ్గ వారు కోవెల అని కొనియాడారు. అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య కిషన్ రావు మాట్లాడుతూ సంపత్కుమారాచార్య స్మారక ప్రసంగాలు సాహితీ సదస్సు వంటివన్నారు. స్మారక ప్రసంగం చేసిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణ రావు సంపత్కుమారా చార్య పద్యాలు ప్రయోగాలు అనే అంశంపై సోదాహరణం మాట్లాడారు. సాహితీ వేత్తలు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య వెలదండ నిత్యానంద రావు తదితరులు పాల్గొన్నారు.