Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు రామచంద్రం, బి.ఎస్.పి. పార్టీ ఎల్బీ నగర్ కంటెస్ట్ అభ్యర్థి నందిగామ వెంకటేష్ ఆధ్వర్యంలో హస్తినపురం సెంట్రల్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజన రాజ్యాధికార సంకల్ప సభ నల్గొండ ఆగస్టు 8న పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరిక సభను విజయవంతం చేయాలని సమావేశం ఏర్పాటు చేశారు. బహుజనులు అంతా అగ్రకుల, అగ్రవర్ణ పార్టీలు వీడి పెద్ద ఎత్తున బహుజన సమాజ్ పార్టీకి మద్దతు ఇచ్చి బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 70సంవత్సరాలు అయినా మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం రాని మూలంగా నేటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావుపూలే ఆశయాలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కుట్రపూరితంగా ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తోందని, పేదరికం పోవాలంటే ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచాలి అని, సామాన్యుడు సంపన్నులు ఒకే చోట చదివే విద్యా విధానాన్ని రూపొందించాలని, ఆ దిశగా బహుజన్ సమాజ్ పార్టీ కషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరికను కార్పొరేట్ విద్యానియంత్రణ జేఏసీ స్వాగతిస్తున్నదని, బహుజనుల రాజ్యాధికారాన్ని సాధించేందుకు తన పదవిని త్యాగం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, సైదులు, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.