Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలో హ్యాండ్ ఆఫ్ హౌప్ సౌజన్యంతో యేసు ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో మేలు కలిగిస్తాయన్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బాబా షరీఫ్, అల్లాపూర్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు హసిని, డైనియల్ పాస్టర్, రేవతి, లక్ష్మి పాల్గొన్నారు.