Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పరిసరాల పరిశుభ్రతతో రోగాలు దరిచేరవని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని భాస్కర్ మోడల్ స్కూల్ వెనుక ఉన్న అపార్టుమెంట్ వాసులు, కాలనీ వాసులను ఆయన కలిసి డ్రయినేజీ, వాటర్, పారిశుధ్యం, పరిశుభ్రత తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో స్పందించిన కార్పొరేటర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం రేషన్ షాపును సందర్శించి కొనుగోలు దారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సరుకులను అందించాలని డీల్లర్కు సూచించారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్, ఖాజా, డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలపీ వాసులు కొల్లి ప్రసాద్‌రావు, బి.శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వరస్వామి, అనిల్‌రావు తదితరులు పాల్గొన్నారు.