Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తన ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ఆదివారం బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నల్గొండ ఎన్జీ కాలేజి మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు ఓయూ నుంచి బహుజన విద్యార్తి సంఘాలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కార్యక్రమంలో బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల సంజరు, ఉపాధ్యక్షుడు పులిగంటి వేణుగోపాల్, బహుజన విద్యార్థి సంఘాల నాయకులు అంబేద్కర్, సునీల్ శెట్టి, కొత్తపల్లి తిరుపతి, మోతె సమ్మయ్య, ఝాన్సీ సిరిపెల్లి, గదేపాక నరేశ్, నవీన్, వెంకటేష్, సంతోస్, మహేష్, రవి, జానీ, భాస్కర్, వెంకట్, బత్తుల కోటేష్, కనుకురి కొటేసు, చందు, రమేష్ పాల్గొన్నారు.