Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
టీపీసీసీ పిలుపు మేరకు ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగబోయే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి దళిత బంధు తీసుకువచ్చింది కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమేనని, ఆపథకాన్ని రాష్ట్ర మంతటా అమలుచేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా సంయుక్త కార్యదర్శి మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి, బాలానగర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మధు గౌడ్, ఉపాధ్యక్షుడు ఆకుల నరేందర్, బాలానగర్ డివిజన్ ప్రచారా కార్యదర్శి ప్రసన్న కుమార్, బాలాజీ నగర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కృష్ణ, బోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి అస్లాం, సీనియర్ నాయకులు బాలనరసింహ, మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ ముకేందర్, గజానంద్ శేఖర్, శివ పాల్గొన్నారు.