Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దేశంలో మూఢనమ్మకాల వల్ల వితంతు మహిళలపై వివక్షత కొనసాగుతుందని శ్రీకర సత్య సేవా సహకార సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు నూతి శ్రీకర శర్మ అన్నారు. సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిరుపేద వితంతు మహిళ గజ్వేల్ రాజ్యలక్ష్మికి కుట్టు మిషన్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సతీసహగమనం, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలను అరికట్టినప్పటికీ ఇంకా దేశంలో అక్కడక్కడ వితంతు మహిళలపై వివక్షత కనబడుతుందన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి మహిళలను ముఖ్యమైన కార్యక్రమాల్లో దూరంగా ఉంచడం జరుగుతుందన్నారు. సమాజంలో నిగూఢంగా పాతుకుపోయిన దురాచారాలను ఉక్కుపాదంతో అణచివేయాలని సూచించారు. వితంతు మహిళలను అన్ని రకాల శుభకార్యాలలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ వారిని ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు మనిగండ్ల శ్రీనివాస్ గుప్తా, న్యాయవాది పి.ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.