Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ కార్యదర్శి సువ్వారి శ్రీనివాస్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న అవినీతి, అరాచక పాలన వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీపీసీసీ కార్యదర్శి సువ్వారి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం చింతల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు చేరుకోవాలని సూచించారు.