Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట/దుండిగల్
వికలాంగులకు అండగా నిలవడం సంతోషకరమని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరంలోని జలవిహార్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 113 మంది వికలాంగులకు మూడు చక్రాలు, ద్విచక్రవాహనాలను అందజేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ తన జన్మదిన వేడుకలకు బదులుగా సేవా కార్యక్రమాలు చేపట్టి పేదలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. తాము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. అనంతరం 113 వాహనాలను ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను మంత్రి కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.