Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మైనంపల్లి రోహిత్ బాబు (మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో సోమ వారం ఉదయం 10 గంటలకు నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని యాప్రాల్‌లో గల బొడ్డు కమ లమ్మ ఫంక్షన్ హాల్లో ఆనందయ్య మెడిసన్ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో ఆనందయ్య మెడిసిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మల్కాజిగిరి నియోజకవర్గంలోని ప్రజలు ఈ సదవశాన్ని వినియోగించుకోవాలని, ఈ మెడిసిన్ వాడి కరోనాను అరికట్టాలని అన్నారు. అలాగే అందుబాటులో ఉన్న ప్రజలందరూ ఈ అవశాన్ని వినియోగించుకోవాలని నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి తెలిపారు.