Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్లపల్లి ఆర్ఓబి పనులపై చర్లపల్లి డివిజన్ నాయకులు
నవతెలంగాణ-కాప్రా
అసెంబ్లీ సాక్షిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి చర్లపల్లి ఆర్ఓబి ఆవశ్యకతను వివరించి నిధుల కోసం పట్టుబట్టిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మర్చిపోయినట్టున్నాడని చర్లపల్లి డివిజన్ టీిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. చర్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరసవేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు జౌండ్ల ప్రభాకర్‌రెడ్డి, డప్పు గిరిబాబు, కర్రె సత్యనా రాయణ, రెడ్యానాయక్ తదితరులు మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలను ఒప్పించి, నిధులు మంజూరు చేయించి దాదాపు 20 రోజులుగా ఓవైపున పనులు జరుగుతుండగా మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ తమ ఉనికిని చాటుకోవడానికి చెర్లపల్లిలో ఆర్ఓబి పనులపై ధర్నా అంటూ డ్రామాకు తెర తీయడం సిగ్గుచేటన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివద్ధి కోసం 250 కోట్ల రూపాయలు అవసరం పడుతుండగా ఇప్పటివరకు కేంద్రం ఇచ్చింది కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అన్న విషయం ఎన్విఎస్ఎస్కు తెలియదా అని వారు ప్రశ్నించారు. ఈ ఏడాది బడ్జెట్లో చర్లపల్లి టెర్మినల్ కోసం కేవలం 50 కోట్లు ఇచ్చామని ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం కేంద్రం తెలంగాణ ప్రజలపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్న విషయం ఎన్విఎస్ఎస్ కళ్లకు కానరావడం లేదని టీఆర్ఎస్ నాయకులు దుయ్యబట్టారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చాంబర్ ముట్టడి స్తామని ప్రగల్భాలు పలుకుతున్న ఎన్వి ఎస్ఎస్కు తన స్థాయి ఏంటో ఒకసారి గుర్తుచేసుకోవాలని వారు హితవు పలికారు. జమ్మిగడ్డ శ్మశానవాటికను అభివద్ధి పరుస్తాం అంటూ 2014లో జమ్మిగడ్డ పరిసర కాలనీలు, బస్తీల ప్రజలను నమ్మించి మోసం చేస్తూ ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత వారికి ఎగనామం పెట్టిన విషయంను ఎన్విఎస్ఎస్ అప్పుడే మర్చిపోయాడని వారు ధ్వజమెత్తారు.
శుక్రవారం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆర్ఓబి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులను వేగవంతం చేసి 4 నెలల్లోగా పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించిన విషయాన్ని మరిచి ఎన్విఎస్ఎస్, ఆయన భజన బందం డ్రామాకు చర్లపల్లిని వేదిక చేసుకోవడం సిగ్గుమాలిన చర్యగా వాళ్ళు అభివర్ణించారు. ఇకనైనా ఎన్విఎస్ఎస్, ఆయన భజన బందం తమ ప్రవర్తనను మార్చుకోకపోతే చర్లపల్లి ప్రజలే తగురీతిలో బుద్ధి చెబుతారని జౌండ్ల ప్రభాకర్ రెడ్డి, డబ్బు గిరిబాబు, కర్రె సత్యనారాయణ, రెడ్యా నాయక్‌లు హెచ్చరించారు.-