Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా తర్వాత స్టూడెంట్లు, తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు
- ఈ ఏడాదిలో 1-10వ తరగతి వరకు 12569 మంది చేరిక
- ప్రయివేటు స్కూళ్ల నుంచి 6772 మంది ఎన్రోల్
- విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరుగుతోందన్న అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కారణాలేమైనా ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజల్లో ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లపై ఆసక్తి బాగా తగ్గింది. కరోనా ప్రభావం తర్వాత వారం తా సర్కార్ బడులకే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివించాలనే ఆలోచన తోనే చాలామంది పేరెంట్స్ ఉన్నారు. ఎన్రోల్ మెంట్ కూడా ఆ దిశగా ఆశాజనకంగా కొనసాగు తున్నాయి. ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో ప్రయి వేటు స్కూళ్లపై విముఖత వ్యక్తం చేసే వారి సంఖ్య పెరుగుతోందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో కొత్తగా 12,569 మంది చేరినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. హైదరా బాద్ జిల్లాలో మొత్తం 682 ప్రభుత్వ పాఠశాలల్లో 1.15లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నారు. అయితే ప్రత్యక్ష బోధన ప్రారంభమైతేగానీ ఎంతమంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు అవుతారో చూడాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు శ్రీకారం చుట్టింది. దీంతో గతేడాది నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమ య్యాయి. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు తాత్కాలికంగా బంద్ పెట్టారు. కరోనా తగ్గు ముఖం పట్టిందన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జిల్లాలోని తొమ్మిది, పదవ తరగతి, ఆపై చదివే విద్యార్థు లకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైన విషయం తెలిసిందే. 6,7,8 తరగతులకు ఫిబ్రవరి 24న తరగతులు షరూ అయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో మార్చి 24 నుంచి ప్రత్యక్ష తరగతులను తాత్కాలికంగా నిలిపివే శారు. జులై 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవ త్సరం ఆరంభమైన నేపథ్యంలో మరోసారి ఆన్లైన్ బాటపట్టాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం 3-10వతరగతి వరకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. డీడీ యాదగిరి, టీ-శాట్ యాప్ ద్వారా విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 60-70శాతం మేర విద్యా ర్థులు ఆన్లైన్ క్లాసులు వీక్షిస్తున్నారు. విద్యార్థులు పాఠాలు వింటున్నారా? క్లాసులు అర్థమవుతు న్నాయా? లేదా అనేదానిపై ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
పదో తరగతిలో అత్యల్పంగా 34 మంది చేరిక
ఈ విద్యా సంవత్సరం హైదరాబాద్ జిల్లాలో ఒకటవ, ఆరో తరగతిలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చేరగా..అత్యల్పంగా పదో తరగతిలో కేవలం 34 మంది మాత్రమే చేరారు. ఒకటో తరగతి - 3895, 2వ - 652, 3వ - 597, 4వ -561, 5వ -496, 6వ - 5425, 7వ -458, 8వ -325, 9వ -126, 10వ - 34 మంది విద్యార్థులు చేరారు. అందులో ప్రయివేటు పాఠశాలల నుంచి 6772 మంది ఉన్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయివేటు ఫీజులు చెల్లించలేక వాటిపై ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం అంతా ఆన్లైన్ బోధన కొనసా గడంతో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఫలితంగా విద్యార్థులు, తల్లిదం డ్రులు సర్కారు విద్యపై వైపు చూస్తున్నారు. మండల విద్యాధికారులు, హెడ్మాస్లర్లు, ఉపాధ్యాయులు ఆయా మండలంలోని బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విన్నవిస్తున్నారు. మరోవైపు ఆసక్తి కలిగిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నేరుగా చేరవచ్చని, విద్యా హక్కు చట్ట ప్రకారం ఎలాంటి పత్రాలు లేకున్నా ప్రవే శాలు కల్పిస్తారని విద్యాధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక దృష్టిసారిస్తే..మంచి ఫలితాలు
డిజిటల్ క్లాసులు కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపు దిశగా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలు బలోపేతం కానున్నాయి. ఆ దిశగా ప్రతి పాఠశాల బృందం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కరోనాకు ముందు విద్యాసంస్థలు తెరవగానే బడిబాట నిర్వహించేవారు. ర్యాలీలు, ప్రదర్శనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేవారు. ఇంటింటా తిరిగే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అన్ని విద్యాసంస్థలు పరోక్ష బోధన దిశగా సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ బడులవైపు ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయి.