Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూలోని ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఒక ప్రొఫెసర్ రెండుకంటే ఎక్కువ పదవులు కలిగి ఉన్నారు. అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్, సైబర్ సెక్యూరిటీ డెరైక్టర్, క్విప్ కో ఆర్డినేటర్, ఐటీడీన్ వంటి పదవులు ఉన్నాయి. లా డిపార్టుమెంట్‌కు చెందిన మరో ప్రొఫెసర్‌కు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్, ఐపీఆర్, యూఎఫ్ఆర్వో, లా సెట్ కన్వీనర్ వంటి అదనపు పదవులున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీ మెకానికల్, ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌కు ఎగ్జామినేషన్ విభాగం కంట్రోలర్, రుసా నోడల్ ఆఫీసర్‌గా, సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఈ విధంగా చాలామంది అదనపు పదవులు అనుభవిస్తున్నారు. బోధనా వృత్తిలో ఉంటూ, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అదనపు పదవులు కలిగి ఉండటంవల్ల సంబంధిత ప్రొఫెసర్లు టీచింగ్‌లో, ప్రాక్టికల్స్‌లో, రీసెర్చ్‌లో స్టూడెంట్లకు న్యాయం చేయలేక పోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ప్రొఫెసర్‌కు ఇతర అదనపు పదవీ బాధ్యతల విధానం సరైంది కాదని కూడా విద్యార్థులు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఓయూలోని కొందరు ప్రొఫెసర్లు, అదనపు పదవులకోసం పాకులాడుతున్నారు. పైరవీలతో పదవులు సంపాదించుకుంటూ అసలు వృత్తికి అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారు. వీసీ ఎవరు చెబితే వింటారో వారితో చెప్పించడమో, లేదా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఉన్నతస్థాయి అధికారులతో పైరవీలు చేసి పదవులు పొందడమో చేస్తున్నారు. దీనిద్వారా బోధన, పరిశోధనా రంగాల్లో ఫలితాలు ఆశించిన మేర ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీలో అర్హులైన ప్రొపెసర్లు సుమారు 110 మంది వరకు ఉన్నా వారికి మాత్రం అవకాశాలు రావడం లేదు. అడ్మిస్ట్రేషన్ పదవులు ఇచ్చే ముందు సీనియారిటీ, సామాజిక న్యాయం, సరైన సామర్థ్యం వంటివి చూడకుండా పైరవీల ఆధారంగానో, తమకు నచ్చిన వారికో పదవులు దక్కుతున్నాయన్న చర్చ జరుగుతోంది.
ఓయూలో దాదాపు ఆరుగురు ప్రొఫెసర్లుండగా ఒక్కొక్కరికి అదనపు పదువులు ఉన్నాయి. ఇట్లయితే వీరు బోధనపై దృష్టి పెట్టడం ఎట్లా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కొన్ని విభాగాల్లో రెగ్యులర్ టీచింగ్ సిబ్బందిలేక కాంట్రాక్టు, పార్టుటైమ్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ప్రొఫెసర్లకు అదనపు పదవుల బాధ్యత మాజీ వీసీ ప్రొ. రామచంద్రం, మాజీ రిజిస్ట్రార్ ప్రొ. గోపాల్‌రెడ్డిల హాయాంలో కట్టబెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఓయూ ప్రొ. రవీందర్ యాదవ్ అంతకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు ఆయనకు విభాగం హెడ్‌గా, డీన్‌గా అవకాశం వచ్చినా కాదని ఒక్క పదవిలోనే కొనసాగారు. ఆయనను ఇతర ప్రొఫెసర్లు ఆదర్శంగా తీసుకోవడం బెటర్ అంటున్నారు కొందరు స్టూడెంట్స్.