Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మల్కాజిగిరి
కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక ప్రజావ్యతిరేక విధానాల కు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఐక్యంగా పోరాడాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. ఆగస్టు 9న సోమవారం సేవ్ ఇండియా దేశ వ్యాప్త పిలుపులో భాగంగా మల్కాజిగిరి చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులు జెండాలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన మోడీ సర్కారు వ్యవసాయాన్ని సంక్షోభంలో పడేసిందన్నారు. రైతు మెడలో ఉరితాడు వేసిందన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 వెజ్ కోడ్లుగా మార్చారని ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన మాట నీటి మూటలాగా మారిందన్నారు. రాజ్యాం గంపై ప్రమాణం చేసి మతోన్మాదంతో పాలిస్తున్న మోడీ విధానాలను ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. బీజేపీ దేశభక్తిలో మొత్తం దేశ ద్రోహమే ఉందన్నారు. సీఐటియూ రాష్ట్ర నాయకుడు నాగేశ్వర్ రావు మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు 200 రోజులకు పని కల్పించి 600 రూపాయలు రోజు వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం మానుకోవాలన్నారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎం.కృపాసాగర్ అధ్యక్షత వహించగా శ్రామిక మహిళ నాయకురాలు మంగ, ఐద్వా నాయకురాలు షేక్ నజ్మా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుంటి లక్ష్మణ్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు యాదిగిరి, డివైఎఫ్ఐ నాయకులు భాస్కర్, సత్యనారాయణ, కెవిపిఎల్ సీనియర్ నాయకులు నర్సయ్య, బుచ్చమ్మ, శాంతయ్య, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.