Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఎవరైనా సరే ఐడోంట్ కేర్ అంటూ ప్రభుత్వ భూముల పరిరక్షణే ద్యేయంగా తహసీల్దార్ విజయలక్ష్మి ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో దడపుట్టిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ సర్వేనెంబర్ 3/1లో అక్రమంగా రాత్రికి రాత్రి నిర్మిస్తున్న నిర్మాణాలను సోమవారం రెవెన్యూ సిబ్బంది సహాయంతో కూల్చివేతలు చేశారు. మొన్న ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 66లో దాదాపు పది నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. వరుసగా కూల్చివేతలు చేపడుతుండడంతో ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న నాయకుల గుండెలలో దడ పుట్టిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పవచ్చును. ఇలా మండలంలోని పలు గ్రామాలలో అక్రమణకు గరవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షంచే చర్యలు చేపట్టారు. అవసరం అయిన చోట భూమి చుట్టు హద్దులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ సహితం ఏర్పాటు చేస్తుండడంతో అధికార పార్టీ నాయకులకు మింగుడు పడడంలేదు. పేద ప్రజలు ఎవరు కూడా ప్రభుత్వ భూములలో స్థలాలు కొనకూడదని, కొన్ని నిర్మాణాలు చేపడితే ఏక్షణమైన చట్ట పరంగా కూల్చివేతలు చేపట్టవచ్చునని తహసీిల్దార్ విజయలక్ష్మి హెచ్చరించారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని తిరిగి నిర్మాణాలు చేపడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.