Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ యూసుఫ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రయివేటు, కార్పొరేట్ పెట్టుబడి దారులకు సహకరిస్తున్న బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ఏఐటీయూసీరాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు యండి.యూసుఫ్ అన్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూ జీడిమెట్ల శాఖల ఆధ్వర్యంలో షాపూర్‌నగర్ మార్కెట్ నుంచి నిర్వహించిన ర్యాలీలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అశోక్, సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఈ.ఉమామహేష్, సీఐటీయూ జీడిమెట్ల గాంధీనగర్ క్లస్టర్ అధ్యక్ష కార్యదర్శులు కిలుకాని లక్ష్మణ్, ఈశ్వర్రావులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలొకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా విక్రయించడం మొదలుపెట్టారన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల కోసం ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేస్తే మోడీ ప్రభుత్వం ప్రయివేటు వారికి విక్రయిస్తున్నారన్నారు. ప్రజల కోసం కాకుండా పెట్టుబడిదారుల కోసం పని చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేస్తామని అబద్దపు వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే దేశం కోసం జాతీ కోసం అంటూ ప్రగాల్బాలు పలుకుతున్నారన్నారు. సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వీఆర్ఎస్ పేరుతో ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారన్నారు. నూతన కార్మిక చట్టాలను రద్దు కోరుతూ కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు ఎల్ఐసీ ఉద్యోగులు సబ్బండ వర్గాలు మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.యేసురత్నం, నియోజకవర్గం అధ్యక్షులు హరినాథ్‌రావు, సీఐటీయూ నాయకులు బీరప్ప, సీపీఐ మండల సహాయ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఏఐటీయూసీ నాయకులుసుంకిరెడ్డి, రాము, మల్లేష్, మహేందర్, నర్సింహరెడ్డి, సుధాకర్, సీఐటీయూ నాయకులు అంజయ్య, దేవదానంపాల్గొన్నారు.