Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
బడుగు వర్గాలకు ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలకు రాజీపడకుండా మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం చేపట్టే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బీసీలు పోరాటం సాగించాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈమేరకు సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బహుజన రాజ్యస్థాపన ప్రస్తుతం బీసీల ముందున్న కర్తవ్యమని, అందుకు బీసీలు రాజకీయ పోరుకు సన్నద్ధం కావాలన్నారు. దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా మహోన్నతమైన ఉద్యమాన్ని నిర్మించి దేశంలో తొలి బహుజన చక్రవర్తిగా పరిపాలన కొనసాగించిన సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి ఉత్సవాలను ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా డివిజన్ మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జయంతి ఉత్సవాల కమిటీని ప్రకటించారు. రాష్ట్రస్థాయి చైర్మెన్‌గా మురళి కృష్ణగౌడ్, వైస్ చైర్మెన్‌గా తాటికొండ విక్రం గౌడ్, చర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కుర్మా బడేసాబ్ చైర్మెన్ బత్తిని నాగరాజు గౌడ్, వరికుప్పల మధు, రాజేందర్ గంగపుత్ర నరేష్, ప్రజాపతి కోఆర్డినేటర్‌గా సరిత గౌడ్, మహేష్ యాదవ్, పి విజరు ఈడిగలను నియమించారు.