Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.రమ, పాలడుగు భాస్కర్, భూపాల్ పిలుపునిచ్చారు. సోమవారం మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో 'భారత రక్షణ దినం'గా పాటించారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని దీక్షా శిబిరం వద్ద రాష్ట్రకార్యదర్శి ఎస్.రమ, చెర్లపల్లి ఇండిస్టియల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బివి.సత్యనారాయణ, జి.శ్రీనివాసులు, వందమంది మంది కార్మికులు పాల్గొన్నారు. నాచారం పారిశ్రామిక ప్రాంతంలో 30 మందితో నిర్వహించిన దీక్ష శిబిరంలో రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉప్పల్ రింగ్రోడ్డువద్ద కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ పాల్గొన్నారు. కాప్రా ఈసీఐఎల్ సర్కిల్ వద్ద ఏఐటీయూసీ, సీఐటీయూ కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీిఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌తోపాటు 50 మంది కార్మికులు పాల్గొన్నారు. బాలానగర్‌లో అశోక్ ఆధ్వర్యంలో 50 మంది దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో వందమందితో ర్యాలీ నిర్వహించారు. దీక్షలో జిల్లా కమిటీ సభ్యులు కె.లక్ష్మన్తోపాటు 30 మంది పాల్గొన్నారు. గండిమైసమ్మ ప్రాంతంలో 300 మందితో జిల్లా ఉపాధ్యక్షులు బి.లింగస్వామి ర్యాలీ నిర్వహించారు.
వ్యవసాయ చట్టాలను ప్రతిఘటిద్దాం
'క్విట్ ఇండియా' స్పూర్తితో వ్యవసాయ చట్టాలను ప్రతిఘటిద్దామని సీఐటీయూ నగర నాయకులు టి.మహేందర్ అన్నారు. అఖిలభారత పిలుపులో భాగంగా చిలుకలగుడలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ ఆగష్టు 9వ తేదికి చారిత్రక నేపథ్యం ఉందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో క్విట్ ఇండియా పిలుపునందుకుని వేలాది మంది జనం వీధుల్లోకొచ్చారని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకొచ్చాక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని అన్నారు. దేశానికి అన్ననంపెట్టే రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సికింద్రాబాద్ జోన్ అధ్యక్ష, కార్యదర్శులు మధు, ఆర్.మల్లేష్, నాయకులు సురేందర్, సత్యనారాయణ రవి, నర్సింహ్మా, వెంకటస్వామి పాల్గొన్నారు.