Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు
- సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-ఓయూ
ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం సీతాఫల్మండీలోని తన క్యాంపు ఆఫీస్లో సీతాఫలమండీ, బౌద్ధనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు చెందిన 60 మందికి రూ.60 లక్షలకు పైగా విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, రూ.20 లక్షలకు పైగా విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల బాగుకోసం ప్రభుత్వం వివిధ సంక్షేమ పధకాలను అమలు జరుపుతోందని, వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవ్వరికీ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ కార్యాలయం నెంబరు 040-27504448 కు ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. అర్హులకు రేషన్ కార్డులను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు జానకి, సునీల్ కుమార్ నతాని, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి, టీఆర్ఎస్ యువ నాయకులు తీగుళ్ల కిషోర్ కుమార్, కిరణ్, రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.