Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించడానికి న్యాయ కళాశాలలు తోడ్పడాలని, అందుకు విద్యార్థులు, న్యాయమూర్తులు కలిసి రాజ్యాంగ లక్ష్యాల సాధన కోసం కషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కోరారు. సోమవారం కళాశాల సెమినార్ హాల్లో డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా బాధ్యతలను చేపట్టారు. అనంతరం నిర్వహించిన భారీ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో న్యాయ కళాశాలలు పని చేయట్లేదన్నారు. సమన్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జనాభా దామాషా పద్ధతిలో ప్రజలందరికీ అందించడమే రాజ్యాంగం లక్ష్యమని, ఆదిశగా న్యాయ విద్యాలయాలు కషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం న్యాయ పరిశోధక విద్యార్థి రాష్ట్ర ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కూకట్పల్లి జడ్జి బొమ్మతి భవాని మాట్లాడుతూ ప్రతి న్యాయవిద్యార్థి అంబేద్కర్ స్ఫూర్తితో ఉన్నత శిఖరాలు అందుకోవాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థులు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డీన్‌ను ఘనంగా సన్మానించారు.