Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
బీఎస్పీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అనుచిత వాఖ్యలు, అసత్య ఆరోపణలు చేయడాన్ని ఓయూ విద్యార్తి సంఘాల నాయకులు, ఓయూ జాక్‌గా తీవ్రంగా ఖండించింది. ఈమేరకు మంగళవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి నాయకులు మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, భాస్కర్ కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని, లేకపోతే తగిన బుద్ధి బుద్దిచెప్పుతాం హెచ్చరించారు. విద్యార్థి నాయకులకు ఎటువంటి ప్రాణాపాయం సంభవించకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుకున్న ఆయనపై అనవసర ఆరోపణలే చేస్తే సహించేదిలేదన్నారు. బీఎస్పీ పార్టీ మాయావతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సమవేశంలో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు వేల్పుల సంజరు, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్, రాజు చెరుకూరి స్వేరో, అంబేడ్కర్, నవీన్, రాజు, పృథ్వీ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.