Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దేవుడిని దర్శించుకోవడానికి టెంపుల్ కు వెళ్లిన ఒక యువతి అదశ్యమైన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఈ మేరకు మంగళవారం నారాయణగూడ ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మక్తల్ గ్రామం, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అరమరాతి సుప్రియ (20), తండ్రి అరమరాతి వెంకటేష్ వత్తి రీత్యా పెయింటర్ గా పని చేస్తూ నగరంలోని ముత్యాలబాగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సుప్రియ తన తమ్ముడు కార్తీక్ (12) తో కలిసి ముత్యాలబాగ్ లోని హనుమాన్ టెంపుల్ కు దేవుడిని దర్శించుకోవడానికి వెళ్లి కనబడకుండా పోయింది.కార్తీక్ ఇంటికి వచ్చి ఈ విషయం చెప్పడంతో తండ్రి వెంకటేష్ సుప్రియ స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేసి తెలుసుకున్న ఫలితం లేకపోవడంతో సోమవారం తండ్రి వెంకటేష్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.సుప్రియ మిస్సింగ్ కు ముందు బ్లాక్ డ్రెస్ దుస్తులు ధరించి ఉంది.ఎత్తు 5 అంగుళాలు, ఆచూకీ తెలిసిన వారు నారాయణగూడ పీఎస్-9490616318 ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరని ఎస్ఐ నవీన్ కుమార్ కోరారు.