Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీడిమెట్ల పరిధి వినాయక్ నగర్లో ఓ మహిళను తన మాజీ ప్రియుడు హత్య చేశాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన పూజ (21) ఏప్రిల్ నెలలో రాజేంద్రన్ వర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకుని హైదరాబాద్ వచ్చింది. అనంతరం ఆమె తన మాజీ ప్రియుడు రాకేష్ తో చాటింగ్, ఫోన్ మాట్లాడడం ప్రారంభించింది. రాకేష్ తన స్నేహితుడితో కలిసి మంగళవారం హైదరాబాద్ జీడిమెట్లలో ఉన్న పూజ ఇంటికి వచ్చి బీహార్ కు రావాల్సిందిగా కోరాడు. పూజ నిరాకరించడంతో దిండుతో ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఈమేరకు కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు