Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
తల్లి పాలే బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవని అంగన్వాడీ రంగారెడ్డినగర్ సెక్టార్ సూపర్ వైజర్ వాణిశ్రీ అన్నారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని వెంకట్రామిరెడ్డినగర్ 3 అంగన్ వాడీ కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు, తల్లులకు తల్లిపాల విశిష్టత గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమృతం కన్న తల్లి పాలు ఎంతో గొప్పవన్నారు. తల్లి పాలలో ఖనిజ లవణాలు, విటమిన్స్ ఏఈడీ, వ్యాధులను తట్టుకునే శక్తి ఉంటుందని తెలిపారు. గర్భిణీలకు సమయానికి భోజనం, పోషకాహరం అందించాలన్నారు. కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు లీలా, రమాదేవి, రాజమణి, ఆయా స్వరూప తదితరులు పాల్గొన్నారు.