Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
కరోనా రాకుండా ఉండేందుకు ఆయుర్వేద మందును తయారు చేసిన కృష్ణపట్నం ఆనందయ్య రాష్ట్రంలోనే తొలిసారిగా మల్కాజిగిరి నియోజకవర్గానికి వచ్చి తన చేతుల మీదుగా మందులు పంపిణీ చేయడం సంతోషించదగ్గ విషయం అని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్‌లో ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఆనందయ్య మందును ఎన్ని లక్షలు ఖర్చయినా ప్రజలకు అందించేందుకు వెనుకాడబోమని తెలిపారు. అనంతరం ఆనందయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన నియోజకవర్గంలో ప్రజలకు ఈమందులను ఉచితంగా పంపిణీ చేయడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి, వై.ప్రేమ్‌కుమార్, రాజ్‌జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీష్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు జీఎన్వీ సతీష్‌కుమార్, బద్దం పరుశురాంరెడ్డి, రావుల అంజయ్య, కొత్తపల్లి ఉపేందర్‌రెడ్డి, మేకల రాముయాదవ్, చిత్ర గోకుల్, సాయికుమార్, గుండా నిరంజన్, ఎస్ఆర్.ప్రసాద్, చెన్నారెడ్డి, చిందం శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, సీహెచ్ మహేష్, శివకుమార్ గౌడ్, వేముల రాజు, నారాయణరెడ్డి, టిక్కమ్ పాల్గొన్నారు.