Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో తలసేమియాతో బాధపడే రోగులకు మనం చేసే రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని, మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్త దానం చేసి ప్రాణదాతలవ్వండని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, ఆర్ఎంఓ డా.జయలక్ష్మి అన్నారు. మంగళవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో బాలానగర్ పోలీసుల ఆధ్వర్యంలో సుల్తాన్‌బజార్ ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని బాలానగర్ సీఐ వాహిదుద్దీన్ తో కలిసి ప్రారంభించారు. హనుమాన్ టెంపుల్ కమాన్ రోడ్డులో ఇద్దరు భార్యభర్తలు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొనడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. శ్రీనివాస్ రెడ్డి అనే కానిస్టేబుల్ బస్తీలో రక్తదాన శిబిరంపై ప్రచారం చేయడంతో పోలీసు అధికారుల్లో సైతం ఒక మహిళ స్వచ్చందంగా రక్తదానం చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కార్యక్రమంలో ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తరుణ్, అఖిలేష్, ఎస్ఐలు రాజేష్ గౌడ్, ఖలీల్ పాషా, సంగమేష్, రమేష్, ఏఎస్ఐ నర్సింహారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.