Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10,756 ట్రాక్టర్లను విక్రయం
- గ్రామీణ ప్రాంత చిన్నారుల కోసం ఎడ్యుటెక్ వేదిక
- సోనాలికాగురుకుల్ ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసాధారణ ప్రదర్శనను ఆర్ధిక సంవత్సర మొదటి త్రైమాసంలో నమోదుచేసిన తరువాత, సోనాలికా ట్రాక్టర్స్ మరింతగా తమ వద్ధిని కొనసాగిస్తూ శక్తివంతమైన ప్రదర్శనను జులైనెలలో కూడా చేయడంతో పాటుగా రికార్డు స్థాయిలో 10,756 ట్రాక్టర్లను విక్రయించింది. తద్వారా 5.2శాతం వద్ధిని నమోదు చేసింది. సోనాలికా ఈ శక్తివంతమైన ప్రదర్శనకునూతన తరపు ట్రాక్టర్ పొర్ట్ఫోలియో తోడ్పాటునందించింది. గ్రామీణ భౌగోళిక వాతావరణ పరిస్థితులను చక్కగా సోనాలికా అర్థం చేసుకోవడంతో పాటుగా రైతుల వేసిన పంటలకు తగిన అవసరాలను తీర్చే రీతిలో తమ ఉత్పత్తులను రూపొందిస్తుంటుంది. ఈ వినూత్నమైన విధానం కారణంగానే కంపెనీ, తమ ప్రపంచశ్రేణి తయారీ కేంద్రాల వద్ద కస్టమైజ్డ్ ట్రాక్టర్స్, ఇంప్లిమెంట్స్ను అభివద్ధి చేస్తుంది. సమాజం పట్ల తమ నిబద్ధతను మరో స్థాయికి తీసుకువెళ్తూ సోనాలికా ఇటీవలనే ఇంటరాక్టివ్ యూట్యూబ్ ఛానెల్ సోనాలికాగురుకుల్ను ప్రారంభించింది. ఈ ఇన్ఫోటైన్మెంట్ ఆధారిత ఛానెల్ 'సోనాలికాగురుకుల్' గ్రామీణ ప్రాంతాలలోని చిన్నారుల విజ్ఞానాన్ని గణనీయంగా వద్ధి చేయనుంది. తమ ఆలోచనలను సోనాలికా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్మిట్టల్ వెల్లడిస్తూ 'రైతుల అవసరాలకు తగినట్లుగా నేడు వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే రీతిలో ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చిన కారణంగానే అసాధారణ ప్రదర్శనను మేము నమోదు చేయగలిగాం. మా కస్టమైజ్డ్ హెవీ డ్యూటీ ట్రాక్టర్ శ్రేణిపై తమ విశ్వాసం ప్రదర్శించిన మా రైతులకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాం. ఈ నమ్మకమే మేము జులై2021లో 5.2శాతం వద్ధితో 10,756 ట్రాక్టర్లను విక్రయించేలా చేసింది. దేశవ్యాప్తంగా వర్షాలు సానుకూలంగా పడుతుండటం, రైతుల వ్యవసాయ అవసరాలు గణనీయంగా మారడంతో, అత్యాధునిక ట్రాక్టర్లుకు డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నాం. 2022 ఆర్థిక సంవత్సరంలో కూడా నూతన ఉత్పత్తులను గరిష్టంగా ఉత్పత్తి చేయగలం' అని అన్నారు.