Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించండి
- జిల్లా అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
చిన్నారులకు న్యూమోనియా రాకుండా పీసీవీ టీకాలు వేయించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సదస్సులో డీఎంఅండ్‌హెచ్‌వో కోటాచలంతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లల్లో వచ్చే న్యూమోనియాను అరికట్టేందుకు న్యూమోకోకల్ కాంజువేట్ వ్యాక్సిన్ వచ్చిందన్నారు. ఈ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో రానుందన్నారు. ఈ వ్యాక్సిన్‌పై ప్రజలకు ఎక్కువగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి వెంకటరమణ, డీసీహెచ్ఎస్ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ నర్సింహారావు, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, డీఎంవో అంజయ్య, ఎస్ఎంవో ప్రసాద్, డీహెచ్ఈ మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు.