Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేట
దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి దేశాన్ని పాలించే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవనంలో ధూళిపాల ధనంజయ నాయుడు అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలంటేనే పూర్తిగా డబ్బు మయం అయ్యాయన్నారు. రాజకీయాల్లో మతం అనే రంగు పులుముతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీని నిలువరించేందుకు దేశ వ్యాప్తంగా లౌకికవాద శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పాలించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ అప్పనంగా అమ్ముకుంటున్నారని తెలిపారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయలేదన్నారు. పోడు భూముల సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్న చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు, యల్లంల యాదగిరి, ఉస్తెల నారాయణరెడ్డి, యల్లవుల రాములు, పాలకూరి బాబు, దొరపెళ్లి శంకర్, పోకల వెంకటేశ్వర్లు, కొండ కోటయ్య, బొల్లు ప్రసాద్, కోప్పోజు సూర్యనారాయణ పాల్గొన్నారు.