Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 600 మంది సీవరేజ్ కార్మికులను ఇక్కడే కొనసాగించాలని జీహెచ్ఎంఈయూ అధ్యక్షులు ఉదరి గోపాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యురాలు అంజనా పన్వార్కు వినతిపత్రాన్ని అందజేశారు. అంజనా పన్వార్తో బుధవారం జరిగిన సమావేశంలో పలు సమస్యలను లేవనెత్తారు. ఆమె సానుకూలంగా స్పందించి అతి త్వరలో ఈ సమస్య మీద కూడా కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కరోనాలో చనిపోయిన వారి సంగతేంటని ఉదరి గోపాల్ ప్రశ్నిస్తే 26 మందికి రూ.14 లక్షలు ఇచ్చినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారని, దీనిపై కొన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలని గోపాల్ కోరారు.