Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
నెలల తరబడిగా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలు మంగళవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు తమ పరిధిలోని కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నారు. ఫస్టు డోస్, సెకండ్ డోస్ కూడా వేస్తుండటంతో వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలో జనం కొవిడ్ టీకాకోసం పోటెత్తారు. డివిజన్ పరిధిలోని కమ్యూనిటీహాల్, బస్తీ దవాఖానాల్లో డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వైద్య, ఆరోగ్య సిబ్బంది డాక్టర్లు, నర్సులు, స్థానిక నాయకులు వ్యాక్సినేషన్ ప్రక్రియలో తమ సేవలు అందిస్తున్నారు.