Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తథ్యమని ఆ పార్టీ డివిజన్ నాయకులు బాల్ ముకుంద మాదిగ, గణేష్ మాదిగ అన్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా వారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే అంకితభావంతో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. హుజురాబాద్‌లో గెల్లుశ్రీనివాస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 16న గోషామహల్ నుంచి టీఆర్ఎస్ యువ నాయకులు భారీ ఎత్తున హుజురాబాద్ ప్రచారానికి తరలి వెళ్తారన్నారు.