Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించిన విద్యార్థి నాయకుడు, ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం ఖరారు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం బాలానగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో అంకిత భావంతో పనిచేశారన్నారు. ఓయూలో విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో తమతోపాటు ఉద్యమంలో పాల్గొన్నారని, జైలుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు. ఆయనను పార్టీ అభ్యర్థిక ప్రకటించడంలో పట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మందడి సుధాకర్ రెడ్డి, కష్ణ మూర్తి, పంజా రాంచందర్, శేఖర్ గుప్త, వార్డు సభ్యుడు శ్రీనివాస్ ముదిరాజ్, ఖాజా, ఎడ్ల మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.