Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆగస్టు 13న ప్రపంచ అవయవదానం అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారని డాక్టర్ ఆర్వీఆర్ రావు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో అవగాహన ఎంతో అవసరమన్నారు. విషమ పరిస్థితులు ఏర్పడినప్పుడు మానవుల్లో కొన్ని రకాల ముఖ్యమైన అవయవాలు పూర్తిగా చెడిపోతుంటాయని, అలాంటప్పుడు ఆయా అవయవాలను బాగు చేసేందుకు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలం అవుతుంటాయన్నారు. అవయవాల వైఫల్యం కారణంగా రోగి పరిస్థితి సంక్లిష్టంగా మారిపోతుందని భావించలేమని, వేరొక వ్యక్తి శరీరం నుంచి అవయవాన్ని సేకరించి రోగి శరీరంలో ప్రవేశ పెట్టడాన్ని అవయవదానంగా పిలుస్తారన్నారు.
అవయవదానం మూడు రకాలు
1.ఆరోగ్యవంతంగా ఉన్న మానవుడి నుంచి అవయవాన్ని సేకరించటం.
2, బ్రెయిన్ డెడ్ వంటి విషమ పరిస్థితికి చేరుకొన్నప్పుడు అవయవాన్ని సేకరించటం.
3.పూర్తిగా నిర్జీవ పరిస్థితికి చేరుకొన్నప్పుడు అవయవాన్ని సేకరించి ఎవరికీ సరిపోతుందో వారిని గుర్తించి అవయవదానాన్ని అందించడం వల్ల మరొకరి ప్రాణాలు కాపాడినవారవుతారు.
లివర్ ట్రాన్సుప్లాంటేషన్
శరీరంలో 500కు పైగా జీవన ప్రక్రియల్లో కాలేయం పాలు పంచుకొంటుంది. జీర్ణ ప్రక్రియతో సహా అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంటుంది. శరీరంలోని జీర్ణాశయానికి కుడివైపున ఉంటుంది. శరీరంలో అనేక ముఖ్య విధులను నిర్వర్తిస్తుండటంతో దీన్ని 'హార్స్ హౌస్ ఆఫ్ ద బాడీ'అని పిలుస్తారు.
డాక్టర్ ఆర్వీ రాఘవేంద్రరావు,
సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ లివర్ ట్రాన్సుప్లాంట్ సర్జన్, డైరెక్టర్, రెనోవా హాస్పిటల్,
బంజారాహిల్స్ రోడ్ నెం12,
సెల్ నెంబర్ 7993089995.