Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ ముద్ద పవన్, అనుచరుల దౌర్జన్యం
నవతెలంగాణ-హైదరాబాద్
అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొ రేటర్లపై అదే పార్టీకి చెందిన మరో కార్పొరేటర్ తన అను చరులతో కలిసి దాడిచేసిన సంఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. సంఘటన వివరాల ప్రకారం.. మీర్పేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్లు కలిసి గురువారం రాత్రి 8 గంటలకు జిల్లెలగూడలో సమావేశమయ్యారు. అదే సమయంలో 10వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ముద్దా పవన్ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని తోటి కార్పొరేటర్లతో వాగ్వివాదానికి దిగాడు. ఈ క్రమంలో పవన్ అనుచరులు హాకీ బ్యాట్లతో దాడికి పాల్పడి అక్కడున్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్ సిద్దాల బీరప్ప, మరో కార్పొరేటర్ సౌందర్య భర్త విజరులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు ముగ్గురు కార్పొరేటర్లు సంఘటనపై మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 7వ డివిజన్ కార్పొరేటర్ సిద్దాల బీరప్ప, 12వ డివిజన్ కార్పొరేటర్ ఇంద్రావత్ రఘునాయక్, 35వ డివిజన్ కార్పొరేటర్ సౌందర్య విజయేందర్కుమార్, 10వ డివిజన్ కార్పొరేటర్ ముద్ద పవన్‌కుమార్ అతని అనుచరులపై మీర్పేట్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డిలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.