Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రామంతాపూర్లోనీ వివేక్ నగర్, కామాక్షిపురం, శ్రీనగర్ కాలనీ, గాంధీనగర్, కలుపుకొని వెళుతున్న ట్రంక్ లైన్ డ్రయినేజీ సమస్యతో గత కొన్ని సంవత్స రాల నుండి ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంగా పలు కాలనీల ప్రజలు కార్పొరేటర్ దష్టికి తీసు కొచ్చారు. కార్పొరేటర్ బండారు శ్రీవాణి స్పందించి. సంబంధిత విషయంపై పలుమార్లు అధికారుల దష్టికి తీసుకెళ్లారు. గురువారం కార్పొరేటర్ వారిపై ఒత్తిడి తేవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్, డీఈ చందన, డీఈ నాగమణి రామంతపూర్ ట్రంక్ లైన్ను పర్యవేక్షించారు. కార్పొ రేటర్ మాట్లాడుతూ ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుండి యూజీడీ సమస్యతో రామంతపూర్ పలు కాలనీల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ట్రంక్ లైన్ సమస్యను అతి త్వరలో తీర్చాలని అధికారులను ఆదేశించారు. అధికారులు స్పందిస్తూ ఈ సమస్యను వెంబడే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వారితో పాటు బీజేపీ నాయకులు రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు, బీజేపీి సీనియర్ లీడర్ వేముల వెంకట్ రెడ్డి, పలు కాలనీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.