Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ మహంకాళి బోనాల పండుగ సందర్భంగా ఉప్పల్‌లోని మహంకాళి అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి చిల్కానగర్ కార్పొరేటర్ గీత అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ మహంకాళి తల్లి ప్రజలను చల్లంగా దీవించాలని, తెలంగాణ సంస్కతికి ప్రతీక బోనాలు అని అన్నారు. ఉప్పల్‌లో ఎక్కడా లేని విధంగా రెండుసార్లు బోనాల పండుగ జరుగుతుంది అని ఆదివారం పోచమ్మ బోనాలు, అదేవిధంగా మహంకాళి బోనాల సందర్భంగా ప్రతి బస్తీ నుంచి, కాలనీ నుంచి అమ్మవారిని తొట్టెలలో మరియు బండి ఊరేగింపు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఉంటాయని, అందరూ కూడా చాలా మంచిగా, జాగ్రత్తగా పండగ చేసుకోవాలని, ఈ కరోనా మహమ్మారిని మహంకాళి అమ్మవారు ప్రపంచం నుంచి తొందరగా పారద్రోలాలని కోరామన్నారు. కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ మాట్లాడుతూ మహంకాళి అమ్మవారు కెేసీిఆర్కి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరోనా మహమ్మారి నుంచి తొందరగా బయటపడే విధంగా వారి ఆశీర్వాదం ఉండాలని, అందరూ కూడా ఈ పండగ వాతావరణంలో జాగ్రత్తగా పండగ నిర్వహించుకోవాలని మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ పండగ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు వేముల సంతోష్‌రెడ్డి, పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి పాల్గొన్నారు.