Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ జీవన్ దాన్ ప్రోగ్రాం ఇన్చార్జి డా.జి స్వర్ణలత
నవతెలంగాణ-బంజారాహిల్స్
అవయదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ జీవన్‌దాన్ ప్రోగ్రాం ఇన్చార్జి డా.జి స్వర్ణలత పేర్కొన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని రెనోవా హాస్పిటల్లో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవన్‌దాన్ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని హాస్పిటల్ నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం కిడ్నీ, కాలేయం వంటి కొన్ని అవయవాలను బతికి ఉన్న వారి నుంచి సేకరించగలుగుతున్నామన్నారు. అయితే గుండె, ఊపిరితిత్తులు వంటి పలు కీలక అవయవాలను బ్రెయిన్ డెడ్ వారి నుంచి మాత్రమే సేకరించాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాల్సి ఉందని ఆమె చెప్పారు. జీవన్ దాన్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత గత 8 ఏండ్లలో 800 పైగా అవయవమార్పిడి చికిత్సలు జరిగినట్లు ఆమె తెలిపారు. రెనోవా హాస్పిటల్స్ గ్రూపు జనరల్ ఫిజిషీయన్ డా స్పందన మాట్లాడుతూ సంస్థలో అవయవదానంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే సుమారు 100 మందికి పైగా సిబ్బంది అవయవదానాన్ని అంగీకరిస్తూ పత్రాలను అందజేశారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రెనోవా హాస్పిటల్స్ వారు అవయవదానాన్ని ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం అవయవదాన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన బోర్డుపై హాస్పిటల్ వైద్యులు సిబ్బంది సంతకాలు చేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శాంతి, సెంటర్ హెడ్ పి శేఖర్, సనత్ నగర్వారి పాల్గొన్నారు.