Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా గురువారం ఓయూలో వినూత్న కార్యక్రమం (మాక్ క్లాస్ రూమ్) నిర్వహించారు. వర్తమాన రాజకీయాలపై క్లాస్ బోధిస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైన్స్‌షాపులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, రాజకీయ వేదికలు, సభలు జరుగుతున్నా విద్యాసంస్థలను ప్రారంభించాలనే కనీస ఆలోచన ప్రభుత్వాలు చేయకపోవడం దుర్మార్గ చర్య అని అన్నారు. విద్యాసంస్థలు ప్రారంభించకపోవడం వల్ల విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. పరిశోధనా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. విద్యార్థులకు వ్యాక్సిన్ అందించి కరోనా జాగ్రత్తలతో విద్యాసంస్థలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఓయూ కార్యదర్శి రవి నాయక్ మాట్లాడుతూ యూనివర్సిటీ హాస్టల్‌ను వెంటనే ఓపెన్‌చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ ఉపాధ్యక్షుడు విజరు, గణేష్, శ్రీకాంత్, నరేష్, చక్రిబాబు, సురేష్, ప్రభా, కిరణ్, రాజేందర్ పాల్గొన్నారు.