Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మానవ వనరుల నిర్వహణ సాఫ్ట్వేర్, సేవలను అందించడంలో అగ్రగామి సంస్థ ఏడీపీ, ప్రీమియం ఐసీయూ యంత్ర సామాగ్రిని హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి విరాళంగా అందజేసింది. తమ కోవిడ్ ఉపశమన ప్రయత్నాలకు అదనంగా, ఈ కంపెనీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటుగా ఐసీయూ పడకల లభ్యతను వృద్ధి చేస్తూనే, కరోనా వైరస్ మూడో వేవ్ భయాల వేళ ఆ ముప్పును ఎదుర్కొనేందుకు ఆస్పత్రిని సిద్ధం చేస్తూ తగిన యంత్ర సామాగ్రిని అందిస్తుంది. దీనిలో భాగంగా ఏడీపీ ఇండియా 10 పడకల ఐసీయూ వార్డ్తో పాటుగా అది పూర్తిగా పని చేసేందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని సైతం అందిస్తుంది. ఈ కంపెనీ ఇప్పుడు కార్డియాక్ మానిటర్లు, వెంటిలేటర్లు, బెడ్స్, ఈసీజీ మెషీన్లు, బైపాప్ మెషీన్లు, డిఫిబ్రిల్లేటర్స్, నర్సింగ్ స్టేషన్‌కు అవసరమైన యంత్ర సామాగ్రి, ఎయిర్ కండీషనింగ్, లారిన్గోస్కోప్స్, ఐసీయూ సిరెంజ్ పంపులు వంటివి అందించింది. ఏడీపీ ఇండియా డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ హెచ్ఆర్ డాక్టర్ విపుల్ సింగ్ మాట్లాడుతూ 'ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, శానిటేషన్ వర్కర్లు, పోలీసులు, ఎన్జీవోలు, అసంఖ్యాక వాలెంటీర్లు, మహ మ్మారి విజంభణ సమయంలో కమ్యూనిటీలను కాపాడేం దుకు శ్రమిస్తూ అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ భాగస్వామ్యంతో ఏడీపీ ఇండియా ఇప్పుడు అధికారులకు ఆరోగ్య మౌలిక వసతు లను మెరుగుపరచడంలో సహాయపడటాన్ని లక్ష్యంగా చేసుకుంది. తగినంతగా వైద్య సంరక్షణ లభిస్తుందనే భరోసానూ అందిస్తుంది' అని అన్నారు. డీఎంఈ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ 'ఈ సంక్షోభ సమయంలో నీలోఫర్ ఆస్పత్రికి తోడ్పాటునందించిన ఏడీపీ ఇండియాకు కృతజ్ఞతలు. ఈ ఆస్పత్రి కేవలం తెలంగాణా రాష్ట్రంలోని చిన్నారులకు మాత్రమే వైద్యం చేయడం లేదు. ఏపీ, కర్నాటక, దగ్గరలోని రాష్ట్రాల చిన్నారులకూ వైద్య సేవలను అందిస్తుంది. కోవిడ్ కోసం సన్నద్ధం కావడంలో మాకు సహాయపడటంలో భాగంగా తీర్చిదిద్దిన ఈ పూర్తి స్థాయి ఐసయూ దీర్ఘకాలంలో కూడా తోడ్పాటునం దించనుంది. నీలోఫర్‌కు ఏడీపీ ఇండియా అందించే మద్దతు, ఇతర కార్పోరేట్ సంస్థలు సైతం సీఎస్ఆర్ ద్వారా తమ వంతు తోడ్పాటును ఈ మహమ్మారి వేళ అందించేందుకు స్ఫూర్తిని అందిస్తుందని నమ్ముతున్నాం' అని అన్నారు. నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ 'ఏడీపీ ఇండియా నుంచి తాము అందుకున్న సహాయానికి కృతజ్ఞతలు. ఐసీయూల కోసం సిద్థమవుతున్న వేళ, ఏడీపీ ఇండియా అందించిన ఈ తోడ్పాటు స్వాగతించతగినది. అవసరమైన ప్రతి ఒక్కరికీ వైద్య సేవనందించాలనే మా నిబద్ధతకు ఇది మద్దతు నందిస్తుంది' అన్నారు.