Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జలమండలి పరిధిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్ర తపై 15 రోజుల పాటు అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నట్టు జలమండలి ఎండీ. ఎం. దాన కిశోర్ తెలిపారు. గురువారం జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ జలమండలిలో పని చేస్తున్న సీవరేజి కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రతపై ఈ నెల 16వ తేదీ నుంచి 30 వరకు అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఈ అవగాహనా కార్యక్రమంలో కార్మికులకు మురు గునీటి నిర్వహణలో చేయాల్సిన, చేయకూడని పనులు, భద్రతా పరికరాల పనితీరు, పారిశుధ్యం పనులు చేపట్టే సమయంలో అవలంభిం చాల్సిన పద్దతులపై అవగాహన కల్పించనున్న ట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్యం పనుల్లో ఎస్వోపి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) గైడ్ లైన్స్ అమలుపై, భద్రతా పరికరాల పనితీరు, వాటిని ఉపయోగించే విధానం, మ్యా న్ హౌళ్ళను శుద్ధి చేసేటప్పుడు వారు తీసుకో వాల్సిన జాగ్రత్తలతో పాటు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం సంభవించినపుడు చేసే ప్రథమ చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. కార్మికులు విధి నిర్వహణలో తప్పకుండా హ్యండ్ గ్లౌజులు, గమ్ బూట్స్, మా స్కులు, బాడీ సూట్ వంటి భద్రతా పరికరాలను ధరించేలాగా ప్రతి మేనేజర్ తమ సెక్షన్ పరిధిలోని సీవరేజి కార్మికులందరికీ ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశిం చారు. ఈ అవగాహనా కార్యక్రమంలో ప్రతి డివిజన్‌కూ అత్యంత నైపుణ్యం గల కార్మికులను గుర్తించి వారితో ఒక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీరు ఆయా ప్రాంతాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగే సీవరేజి పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పనిని పూర్తి చేస్తారనీ, ఈ టీమ్ డీజీఎం ఆధ్వర్యంలో పని చేస్తుందని వివరించారు. ఈ పనులు సక్ర మంగా జరుగడానికి ఒక '' సోషల్ ఆడిట్ టీమ్'' కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీరు ఆయా సందర్భాల్లో జరుగుతున్న మురుగునీటి నిర్వహణ పనులును తనిఖీ చేస్తూ ఎప్పటిక ప్పుడు నివేదిక అందిస్తారని పేర్కొన్నారు. కేవలం కార్మికులకే కాకుండా వినియోగదారులకు మ్యాన్ హౌళ్ళను తెరవకుండా, మ్యాన్ హౌళ్ళల్లో చెత్తా, చెదారం వేయకుండా ఉండేందుకు అవగాహన కల్పంచాని వెల్లడించారు. దీని కోసం కరపత్రాలను ముద్రించి అవగాహన కల్పించా లని తెలిపారు. అంతే కాకుండా ఇందులో పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జలమండలిలో ఉన్న పలు యూనియన్లను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. భారీ, మినీ జెట్టింగ్ మిషన్ల యజమానులకు, ఆపరేటర్లకు కూడా జలమండలి ప్రధాన కార్యాల యంలో ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహిం చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమం డలి ఈఎన్సీ, డైరెక్టర్ ఆపరేషన్స్-1 అజ్మీరా కృష్ణ, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రవిచంద్రన్‌రెడ్డి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.