Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం, జల్పల్లి మునిసిపాలిటీ పరిధిలోని మరాఠా భవన్లో ఏర్పాటు చేసిన జాబ్మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశౄరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెజాన్, మ్యాజిక్ బస్, మైక్రో మాక్స్, విప్రో మహేశ్వరం, అపోలో ఫార్మాసి, మెడ్ ప్లస్, వరుణ్ మోటార్స్, సెంట్రో, యురేక లాంటి ప్రముఖ సంస్థల్లో అవకాశాలను నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలుజారీ చేశారన్నారు. మహేశ్వరంలో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా సుమారు 1800 మంది యువతకు ఉద్యోగ అవకాశం కల్పించామన్నారు. జల్పల్లి మున్సిపల్లో ఉన్న మైనార్టీ యువతకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి, మరోసారి షాహీన్ నగర్, ఎర్రకుంటలో జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15 వేలకు పైగా వచ్చిన కంపెనీలలో 15 లక్షలపై చిలుకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు.కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ జి.ప్రవీణ్ కుమార్, మున్సిపల్ చైర్మెన్ అబ్దుల్లా సాది, రిప్రజెంటేటివ్ వైస్ చైర్మెన్ యూసూఫ్ పటేల్, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఎక్బాల్ ఖలిఫా, కౌన్సిలర్లు షేక్ పమీద అప్జల్, ఎండి. శంశోద్దిన్, పల్లపు శంకర్, లక్ష్మీ నారాయణ, భాషమ్మ, పుష్పమ్మ కొండల్ యాదవ్, దస్తగిర్, ఖాలెద్ మారుస్, టీఆర్ ఎస్ సినియర్ నాయకులు ఖైసర్, మహేశ్వరం నియోజక వర్గం ఎస్సీ సెల్ ప్రదాన కార్యదర్శి వై.జనార్దన్,వివిధ ప్రైవేటీ సంస్తల సిబ్బంది పాల్గొన్నారు.