Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎల్ గోపాల్ రావు
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని జాతీయ వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎల్ గోపాల్ రావు, జాతీయ నాయకులు అందె రాంబాబు అన్నారు. నాంపల్లి మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట గోషామహల్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ఇన్చార్జీ రవి మాదిగ చేపట్టిన రిలే దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లా కో ఇన్చార్జ్ ఎం. అరుణ్ కుమార్. జాంబాగ్ డివిజన్ ఇన్చార్జి విజరు కుమార్, బేగంబజార్ ఇన్చార్జి శ్రీనివాస్ మాదిగ, సాయి, రవీందర్, రాజేష్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.