Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్వీక్-2021, లేజర్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వారంరోజులపాటు ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈపోటీలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈఎంఈ సైలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ మోటివేషన్‌తో సెయిలింగ్ పోటీలను నిర్వహించడం మంచి పరిణామమని అన్నారు. రెండు అసోసియేషన్ల కృషిని ఆమె ప్రశంసించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సెయిలర్స్ పాల్గొనడానికి ఇదొక మార్గమని చెప్పారు. 75స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 75బోట్లతో పోటీలను గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్ అఫ్ నావల్ స్టాఫ్, యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(యారు) ప్రెసిడెంట్ అడ్మిరల్ కర్మాబిర్సింగ్ పాల్గొన్నారు.