Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్
- జూబ్లీహిల్స్లో లుజోబాక్స్ ప్రారంభం
నవతెలంగాణ-బంజారాహిల్స్
విదేశాల్లో ప్రాచుర్యం పొందిన బ్యూటీ కాస్మోటిక్ ఉత్పత్తలను దేశీయ మార్కెట్లో వినియోగదారులకు అందించేందుకు శుక్రవారం జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లుజోబాక్స్ కియోస్క్ లాంచ్ తారల సందడితో కళకళలాడింది. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రత్యేక అతిథిగా హాజరై ప్రారంభించి ప్రసంగించారు. పెట్టబడులకు హైదరాబాద్ నగరం అనువైన ప్రాంతం అని తెలిపారు. లుజోబాక్స్ సంస్థ కోఫౌండర్ స్వప్న బొజ్జ మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా సేవలను అందించిన తమ సంస్థ కియోస్క్ విభాగంలోకి అడుగుపెట్టిందన్నారు. రానున్న ఆరు నెలల్లో కోల్కత్తా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి వంటి ప్రాంతాల్లో 60కి పైగా వీటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులకు కావాల్సిన పలు దేశాల బ్రాండ్లైన హెయిర్, ఫేస్, బాడీ కేర్, కలర్ కాస్మోటిక్స్ ఈబాక్స్ ద్వారా పొందవచ్చని, కస్టమైజ్ ఎంపిక కూడా ఈ బాక్స్ ప్రత్యేకత అని వివరించారు. కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు విశ్వక్సేన్తోపాటు నటి శ్రీదేవి విజరు కుమార్, నిత్యా నరేష్, నిత్యాశెట్టి, బిగ్బాస్ ఫేమ్ దివి, సంస్థ్ధ సీఈఓ అండ్ ఫౌండర్ అమిత్ గిరి, డైరెక్టర్ స్టాటర్జీ అండ్ ఇన్నోవేషన్స్ భాను రెడ్డి వరాల, కళామందిర్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.