Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కాప్రా డివిజన్ పరిధిలోని కేసీఆర్ మల్లికార్జున్ నగర్ కాలనీలోని నిరుపేదలపై జలమండలి అధికారులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కాలనీలోని 120 కుటుంబాలు హౌసింగ్ బోర్డ్ జలమండలి కార్యాలయం, మున్సిపల్ సర్కిల్ కార్యాలయల ఎదుట కూర్చుని పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు దొమ్మటి కిరణ్ కుమార్ రావు, వెంకటేష్ మాట్లాడుతూ కేసీఆర్ మల్లికార్జున నగర్లో దాదాపు 13 ఏండ్లుగా 120 కుటుంబాలు గుడిసెలు వేసుకుని, ఇండ్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. తమ కాలనీని ప్రభుత్వం గుర్తించి 322 మందికి ఓటర్ ఐడీ కార్డులు, ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, స్థానిక ధ్రువపత్రాలు మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వానికి స్థానిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా మనీ, గత ఎన్నికల సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డితో పాటు ఆయన సతీమణి స్వప్నారెడ్డి ఎన్నికల్లో భాగంగా తమ కాలనీకి విచ్చేసి, మీ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చారని గుర్తు చేశారు. ఈమ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిం చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామనీ, జలమండలి డీజీఎం కృష్ణకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. గతేడాది స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజు శివమణి, డివిజన్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు దొమ్మాటి కిరణ్ కుమార్ రావుతో కలసి వినతి పత్రం ఇచ్చినా నేటి వరకు జలమండలి అధికారులు చుట్టూ తిరుగుతున్నామని తెలిపారు. మూడేండ్ల క్రితం ప్రభుత్వం తమ కాలనీకి మిషన్ భగీరథలో భాగంగా కాలనీ గల్లీలో మంచి నీటి పైప్ లైన్లు వేసిందనీ, మంచి నీటి కనెక్షన్ ల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నామని తెలిపారు. ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదనీ, మంచినీటి కనెక్షన్లు తీసుకుందామని పైప్ లైన్లు వేసుకున్న తమ కాలనీలోని నలుగురిపై జలమండలి అధికారులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1 కే నల్లా కనెక్షన్ అంటూ నిరుపేదలకు ఇంటింటికీ నల్లా కనెక్షన్ అందిస్తామని సీఎం కేసీఆర్ హామీనిస్తే అధికారులేమో నిత్యం కూలీ పని చేసుకుని బతికే పేద వారిపై అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకున్నారని కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కొంతమంది భూ కబ్జాదారులు తమ కాలనీని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీరు తమ కాలనీకి రాగా కాలనీ వాసులంతా చుట్టుముట్టినట్టు తెలిపారు. వారి ఆగడాలను ఏ మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. తమపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయకుంటే 120 కుటుంబాలు, అన్ని పార్టీలతో కలిసి జలమండలి కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు గడిపి రవి, ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి లింగస్వామి, కోశాధికారి పరశురాం, వెంకటస్వామి, సంయుక్త కార్యదర్శి రాజు, సోమేష్, రమేష్, విజరు, శివ, రాంబాబు, మహేష్, సంపత్, సమ్మక్క, వినోద, కేతమ్మ, లలిత, కవిత, స్వప్న, సోఫియా, ఆశ, భాస్కర్, ప్రవీణ్ చారి, వాసంశెట్టి రాంబాబు, మొహమ్మద్ అఫ్జల్, కాసిం, షాహీన్, తస్లీమ్, రవళి, శారద నాయక్, సత్యవతి, బోశ య్య, ఎల్లమ్మ, ఆంజనేయులు, సౌందర్య లావణ్య, ప్రమీల మ్మ, సాంబయ్య, శాంతమ్మ, భారతి, మహేందర్, మహే శ్వరి, వినోద, మాధవి, అబ్దుల్ గని, నాగమణి, శైలజ, మధు, లక్ష్మి, రాజేశ్వరరావు, బండారి వెంకన్న పాల్గొన్నారు.