Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రేపటి పంద్రాగస్టు (స్వాతంత్య్రదినోత్సవం) వేడులక సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. శాఖాపరమైన ఏర్పాట్లు చేశారు. ఆదివారం గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే జంటకమిషనరేట్ల అధికారులు సున్నిత ప్రాంతాలపై నిఘా ముమ్మరం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు చర్యగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను అమలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలతోపాటు, విమానాశ్రయం, పాత బస్తీ, ఐటీ కారిడార్ పరిధిల్లో నిఘాను అధికం చేశారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా నుంచిన పోలీసులు వారి కదలికలపై ఓకన్నేశారు.
జోన్ల వారీగా నిఘా
నగరంలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, సెంట్రల్ జోన్‌తో పాటు సైబరాబాద్‌లోని అన్ని జోన్లలో పనిచేస్తున్న సిబ్బందిని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ప్రతి చిన్న గల్లీని సైతం నిర్లక్ష్యం చేయకుండా పోలీసులు ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలంటూ అంతర్గతంగా ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
సీసీ కెమెరాలతో అప్రమత్తం
నగరంలో జరిగే ప్రతి సంఘటన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యేలా పోలీసులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాల పనితీరును పరిశీలిస్తున్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఎదుర్కొనేందుకు 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో పోలీసులతో పాటు వ్యాపారులు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు పెద్దపీఠ వేస్తూ స్థానిక ప్రజలను సైతం ఆయా పోలీస్‌స్టేషన్ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు.