Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో ఉన్న అందరికీ దళిత బందును అమలు చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-పాల్వంచ
దళితలకు మూడెకరాల భూమి ఇస్తానన్న దానిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. స్థానిక పాల్వంచ పట్టణం మంచికంటినగర్లో సోమవారం పార్టీ 1, 2 శాఖ మహాసభలకు ముఖ్యఅతిథిగా కనకయ్య హాజరయ్యారు. ముందుగా మహాసభ సందర్భంగా పార్టీ జండా ఆవిష్కరణ, రెండో వార్డు శాఖ కార్యదర్శి తులసి రామ్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మెరుగు ముత్తయ్య అధ్యక్షుడు జరిగిన మహాసభలో అన్నవరపు కనకయ్య మాట్లాడారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణనీ అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ చేశాడన్నారు. దళిత బందును రాష్ట్రంలో ఉన్న దళితులు అందరికీ రూ.10 లక్షల ఇవ్వాలి, లేదంటే తీవ్ర ప్రతిఘటన తప్పదన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంచికంటి నగర్ అనేక పోరాటాల ఫలితంగా ఫలితంగా ఏర్పడిందన్నారు. ఈ ప్రాంతంలో మార్కిస్ట్ పార్టీని అభివృద్ధి చేయడం కోసం ప్రతి పార్టీ సభ్యుల కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పట్టణ కార్యదర్శి దొడ్డా రవికుమార్ మాట్లాడుతూ మంచికంటి నగర్ ప్రాంతానికి కిన్నెరసాని పైపు లైను ఏర్పాటు చేయాలని, పాల్వంచ పట్టణం పూర్తిగా సీజనల్ వ్యాధులో కూరుకుపోయిందని, డెంగ్యూ వ్యాధితో ఇప్పటికే నలుగురు చనిపోయారని, తక్షణం ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతి వార్డులో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రకాల టెస్టులు నిర్వహించాలని దీనిపై స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని వారి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ మహాసభలు పార్టీ పట్టణ కమిటీ సభ్యులు కే.సత్య, వాణి, నిరంజన్, రహీం, మూడో వార్డు శాఖ కార్యదర్శి గుర్రం రాములు, 1 2 వార్డులో శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.