Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సాహిత్యం, కళలతో సమాజంలో మంచి వైపు మార్పు సాధ్యమని తెలంగాణా మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. రవీంద్రభారతిలో సిందేంద్ర ఆర్ట్స్ అకాడెమీ 39వ వార్షికోత్సవం భాషా సాంస్కతిక శాఖ సౌజన్యం తో నిర్వహించారు. భార్య సుబ్బులక్షితో కలసి ప్రముఖ గాయకుడు బాల కామేశ్వరరావు మధురంగా సినీ గీతాలు ఆలపించారు. తండ్రి కుమారుడు, లక్ష్మణ్, కార్తికేయ, మామ, కోడళ్లు పాటలు పాడారు. రేణుక ప్రభాకర్ తమ శిష్యులు శ్రీయ, ప్రణతిలతో, గీతిక, రీతిక సోదరీమణులు చేసిన నత్యాలు ఆకట్టు కున్నాయి. ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రయ్య పాల్గొని కళాకారులను సత్కరించారు. యువ నాయకుడు ముఠా జయసింహ, సాహితీవేత్త డాక్టర్ వోలెటి పర్వతీశం పాల్గొనగా సంస్థ నిర్వహకురాలు దేవసేన అధ్యక్షత వహించారు.