Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మలక్‌పేట్
అతి పెద్డ జ్యూవెలరీ సంస్థలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ దిల్సుఖ్నగర్ షోరంలో ''మైన్ డైమండ్స్'' షోని బుధవారం ముఖ్య అతిథుóలుగా నూకల పద్మా రెడ్డి (రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఫండర్ అండ్ ప్రెసిడెంట్), చైతన్య బాబీ (ప్యాషన్ డిజైనర్), బండి ప్రియంక, శివాని, వైష్ణవి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూకల పద్మారెడ్డి మాట్లాడుతూ మహిళల కు బంగారు ఆభరణాలు అంటే ఎంతో మక్కువ అని అన్నారు. అన్ని రకాల ఆభరణాలు మలబార్లో కోరుకున్న డిజైన్స్‌లో లభ్యం అవుతాయన్నారు. అనంతరం షోరూం ఇన్చార్జ్ రదీష్ మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన సంస్థ అన్నారు. ఈ డైమండ్స్ షోలో ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు, ప్లాటినం, ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నాము అన్నారు. మీకు నచ్చిన వాటిని సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరంలో ఆగస్ట్ 18 నుండి 23 వరకు, 2021 ఈ డైమండ్‌స షో కొనసాగుతుందని అని తెలియజెసారు. ఈ కార్యక్రమం లో మార్కెటింగ్ మేనేజర్ నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.